ETV Bharat / state

నెల్లూరు వ్యాపారి హత్య కేసు.. మరో నిందితుడి అరెస్టు - నెల్లూరు నగర డీఎస్పీ మురళీకృష్ణ

గత ఏడాది నవంబరులో నెల్లూరు ఫత్తేఖాన్​పేట వద్ద తుపాకీతో కాల్చి వ్యాపారిని హత్య చేసిన కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

నెల్లూరు నగర డీఎస్పీ మురళీ కృష్ణ
author img

By

Published : Jun 29, 2019, 7:13 PM IST

నెల్లూరు నగర డీఎస్పీ మురళీ కృష్ణ

నెల్లూరు ఫత్తేఖాన్ పేట వద్ద గతేడాది నవంబర్​లో తుపాకీతో కాల్చి వ్యాపారిని హత్య చేసిన కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1, ఏ2, ఏ6 అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, శుక్రవారం రాత్రి ఏ4 షేక్ సలీం రసీదును పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది నవంబర్​లో రాజ్ పురోహిత్ మహేంద్ర సింగ్ అనే వ్యాపారిని తుపాకీతో కాల్చి నిందితులు పరారయ్యారు. అప్పట్లో ఈ విషయం కలకలం సృష్టించడంతో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉండటంతో... వారిని త్వరలోనే పట్టుకుంటామని నెల్లూరు నగర డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. హత్యకు ఉపయోగించిన తుపాకీలోని ఓ భాగాన్ని, మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి...మేకల కాపర్లను కాపాడే యత్నంలో.. శునకం మృతి

Intro:Ap_vsp_46_29_balika_kidnap_ninditudi_arest_ab_AP10077_k..Bhanojirao_Anakapalli
విశాఖ జిల్లా అనకాపల్లి లో జరిగిన బాలిక కిడ్నాప్ కేసులో లో నిందితుడిని అనకాపల్లి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించిన వివరాలను అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ తాతారావు విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం

Body:ఈనెల 25వ తేదీన విజయవాడ కృష్ణ లంక కు చెందిన ఒక మహిళ తన మూడేళ్ల కుమార్తెతో కూలి పని నిమిత్తం రైలు ఎక్కి ఇంట్లో నుంచి వచ్చింది రాజమహేంద్రవరం వద్ద ఎం. సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను కూలి పని ఇప్పిస్తానని చెప్పి మహిళ మూడేళ్ల బాలిక ను తనతో పాటుగా అనకాపల్లి తీసుకొచ్చాడు. ఈనెల 27న వీరు తుమ్మపాల వద్ద కూలిపనికి వెళ్లారు. 28వ తేదీన పని దొరకక పోవడంతో సినిమాకి వెళ్లారు. మధ్యలో మూడేళ్ళ చిన్నారికి తినుబండారాలు కొంటానని చెప్పి చిన్నారితో పాటుగా సురేష్ బయటకు వచ్చాడు ఎంతకీ వీరు రాకపోవడంతో మహిళ బయటకు వచ్చి చూసింది తన మూడేళ్ళ చిన్నారి కనిపించడం లేదని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించింది వీరు సీసీ ఫుటేజీలను పరిశీలించి బాలికను ఎత్తుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు కనుగొన్నారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసారు. 29వ తేదీ ఉదయం సింహాచలం వద్ద బాలిక ఆచూకీ కనుగొని నిందితుడుఎం సురేష్ ని అదుపులోకి తీసుకొన్నారు. విజయనగరం జిల్లా కోట పల్లి గ్రామానికి చెందిన సురేషు తాపీ పని చేసుకుంటూ విజయవాడలో జీవిస్తున్నాడు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు కేసులో నిందితు లను పట్టుకోవడంలో ప్రతిభ చూపినపట్టణ ఎస్సైలు రామకృష్ణ , స్వీటీ, కానిస్టేబుల్ దేముడు బాబులను అభినందించారు.

Conclusion:బైట్1 తాతారావు అనకాపల్లి పట్టణ సీఐ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.