ETV Bharat / state

కాలువ కథ.. అదే వ్యథ

author img

By

Published : Oct 1, 2020, 2:27 PM IST

సోమశిల ఉత్తర కాలువ కొన్ని గ్రామాలకు ‘ఉత్త’ కాలువ అన్న చందంగా మారింది. వెడల్ఫు. పొడిగింపులతో రాళ్లపాడు జలాశయం వరకు అభివృద్ధి చెందుతున్నా.. సమీపంలోని అనంత సాగరం, ఆత్మకూరు, అనుమసముద్రం మండలాల రైతులకు మాత్రం కష్టాలు తీరడం లేదు. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచని సమస్యలతో అవస్థలు పడాల్సి వస్తోంది.

నీటి కాలువ
నీటి కాలువ

ఉత్తర కాలువకు అటవీ అనుమతుల సమస్యతో 42వ ఉప కాలువ నిర్మాణం ప్రారంభంలో మొదలు కాలేదు. దీంతో కాలువ అంతా తవ్వినా నిరుపయోగంగా మారింది. 112 కి.మీ. రాళ్లపాడు వరకు సాగునీరు అందించేందుకు సిద్ధమవుతోందని ఆనందించాలో, పక్కనే 100 మీటర్ల దూరంలో నీరు తరలుతున్నా బీడుగా ఉన్న పొలాలు చూసి బాధపడాలో అర్థం గాని స్థితి రైతులది. అయిదు వేల ఎకరాల ఆయకట్టు పైనే ఉన్న ఆత్మకూరు చెరువుకు ఏళ్లుగా నీటి తరలింపులో అవస్థలే. ఆత్మకూరు బ్రాంచి కాలువ నీటిని బొగ్గేరులోకి తరలిస్తారు. దీని ఆనకట్ట వరకు ఉండే కాలువ తరచూ గండ్లు పడి సాగునీరు ఇంకిపోయి.. చెరువు సజావుగా చేరవు. బొగ్గేరులో కాంక్రిట్‌ వాల్వ్‌లతో కాలువ, పైప్‌లైన్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నా.. దశాబ్దాలుగా కార్యరూపంలోకి రావడం లేదు. ఫలితంగా జలాలు వృథా అవుతున్నాయి. రెండో పంటకు ఆత్మకూరుకు సాగునీరు విడుదల చేసినా.. ఈ కాలువపై నమ్మకం లేక సగం మంది రైతులు పొలాలు బీడుగానే వదిలేశారు.

ప్రతిపాదనలు ఆశలు తీర్చేనా

జలాశయం ఆయకట్టు అభివృద్ధి ప్రతిపాదనలు రైతుల్లోఆశలు రేకెత్తిస్తున్నాయి. రూ. 716 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ. 650 కోట్లతో ఉత్తర కాలువ వెడల్పు చేయడం ప్రధానాంశం. కానీ, ఇప్పటికే ఒకసారి 700 క్యూసెక్కులు తరలించే స్థాయిలో వెడల్పు చేసిన ఈ కాలువను ఇంకా చేస్తామనడంపై స్పష్టత కొరవడింది. రూ.66 కోట్లతో జలాశయం పటిష్ఠం పరిచే పనులు చేయాల్సి ఉంది. ప్రత్యేక నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం ఏమేమి చేపట్టాలో నిర్ణయించాల్సి ఉంది.

సోమశిలకు మహర్దశ

- కృష్ణారావు ఎస్‌ఈ

జలాశయం అభివృద్ధికి నిర్దేశించిన ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే ప్రాజెక్టుకు మహర్దశ వస్తుంది. రూ. 650 కోట్లతో ఉత్తర కాలువ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపారు. ఈ కాలువ పరిధిలోని 1.2 లక్షల ఎకరాలు అభివృద్ధి అవుతుంది. 50 చెరువులకు నీరు మరింత మెరుగ్గా అందుతుంది. ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. డ్యామ్‌ రిహాబిలిటేషన్‌ ఇంప్రూమెంట్‌ ప్రోగ్రాం-2 పేరుతో ఈ అభివృద్ధి పనులు చేపడతారు. రెండు నెలల్లో ఈ పనుల ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తాయి.

100 మీటర్లులో నీరున్నా పొలాలు బీడే

- మాల్యాద్రి రెడ్డి, రైతు ఆరవీడు

ఉత్తర కాలువ చెంతనే ఉంది. పక్కనే 100 మీటర్ల దూరంలోని పొలాలు బీడుగా ఉన్నాయి. మా పొలాలకు సాగు నీరు అందించాలని అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కష్టాలు మాత్రం తీరలేదు. కొద్దిపాటి వ్యయంతో ఎత్తిపోతల అందుబాటులోకి తెస్తే మూడు గ్రామాల పరిధిలో రెండు వేల ఎకరాలు సాగులోకి వస్తుంది. ఆ దిశగా పనులు చేపట్టి ఆదుకోవాలి.

చీలు కాలువలో పెరిగిన ఈ జమ్ముతో ఆయకట్టుకు సజావుగా నీరందని స్థితి. దీని పరిధిలో 200 పైనే ఎకరాలు ఉండగా.. మరో రెండు గ్రామాలకు చెందిన 600 ఎకరాల రైతులు నిత్యం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ఇది ఉత్తర కాలువ 42వ ఉప కాలువ. ప్రధాన కాలువ నుంచి మొదటి కిలో మీటరు అటవీ అడ్డంకులతో నిర్మాణం చేపట్టలేదు. మిగిలింది 18 ఏళ్ల కిందటే పూర్తయినా.. దీన్ని ఇలా వదిలేశారు. ఫలితంగా కాలువ ఇలా కంప చెట్లతో నిండిపోయింది. దీని పరిధిలోని అయిదు గ్రామాల ఆయకట్టు అభివృద్ధికి నోచుకోలేదు.

ఇదీచదవండి

విజయవాడ బాపు ప్రదర్శనశాల పునఃప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.