ETV Bharat / state

నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు - special poojas on the occasion of karthika pournami news

కార్తిక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని కలెక్టర్ దర్శించుకున్నారు.

sri rajarajeshwari temple
శివాలయాల్లో కార్తీక పూజలు
author img

By

Published : Nov 30, 2020, 1:58 PM IST

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి.. భక్తులు పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు.

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. జిల్లాలోని నాయుడుపేట శ్రీ అఖిలాండేశ్వరిదేవి సమేత జంబుకేశ్వరస్వామి శివాలయానికి భక్తులు పోటెత్తారు. మహిళలు దీపారాధన చేసి..మెుక్కులు తీర్చుకున్నారు.

ఇదీ చదవండి: శ్రీశైలం దేవాలయంలో దేదీప్యమానంగా కార్తిక దీపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.