నెల్లూరు జిల్లా ఉదయగిరి దిలావర్భాయ్ వీధిలోని చెక్కనగిషీ కేంద్రంలో పనిచేసే 40 మంది మహిళా కార్మికులకు కేంద్రం నిర్వాహకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు మంజూరు చేసిన లక్ష రూపాయల నగదుతో ఒక్కో మహిళా కార్మికురాలికి రూ.2200 విలువైన బియ్యం, నిత్యావసర సరకులు అందించారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ భారంగా మారిన పేదల ఇబ్బందులను క్రాఫ్ట్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లగా.. వారు స్పందించి నిత్యావసర సరకులకు ఆర్థిక సహాయం చేశారని నిర్వాహకులు తెలిపారు.
ఇదీచదవండి.