నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం, గౌతంరెడ్డి అనుచరుల మధ్య వివాదం మంత్రి గౌతంరెడ్డికి తలనొప్పిగా మారింది. గతంలో ఆత్మకూరులో గెలిచిన ఆనం.. ప్రస్తుతం వెంకటగిరి నుంచి గెలిచారు. గౌతంరెడ్డి ఆత్మకూరులో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఇటీవల ఆనం వర్గీయులు మంత్రికి మద్దతుగా ఉంటారని రాంనారాయణరెడ్డి చెప్పారు.
అయితే నేడు జలకళ వాహనం ప్రారంభోత్సవ సమావేశంలో ఇరు వర్గాల అనుచరుల మధ్య వివాదం రాజుకుంది. ప్రారంభోత్సవ ఫ్లెక్సీలో ఆనం రాంనారాయణరెడ్డి ఫొటోలు, పేరు వేయలేదనే విషయం దగ్గర ఈ గొడవ మొదలైంది. తమ నాయకుడి పేరు ఎందుకు వేయలేదని ఆనం వర్గీయులు మంత్రి గౌతం రెడ్డిని నిలదీశారు. గౌతం రెడ్డి అనుచరులు వారి మీదకు గొడవకు వెళ్లారు. మంత్రి చెప్పినా వినకుండా బాహాబాహీకి దిగారు. దీంతో మంత్రి అక్కడినుంచి అసహనంగా వెళ్లిపోయారు.
ఇవీ చదవండి..