తమకు వన్ మ్యాన్ సర్వీసులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆర్టీసీ డిపో వద్ద ధర్నాకు దిగారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. భద్రతకు ముప్పుగా ఉన్న సర్వీసులను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. డ్రైవర్లను బలవంతంగా టీం సర్వీసులకు పంపే విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బలవంతపు విధుల వల్ల నిన్న డిపో ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ మల్లికార్జునరావుకు న్యాయం చేయాలన్నారు. ప్రతి కార్మికుడికి నెలకు మూడో సెలవు మంజూరు చేయాలని కోరారు.
ఇదీ చూడండి: