పది రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రోడ్లు గుంతలమయంగా మారాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్మకూరు నుంచి సోమశిల, నెల్లూరుపాళెం, బైపాస్ రోడ్డు, అప్పారావుపాళెం వెళ్లే రోడ్లు దారుణంగా తయారయ్యాయి.
అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు వర్షాలకు ఇంకా అధ్వానంగా తయారయ్యాయి. వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: