కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన ఆంక్షలను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. నెల్లూరులో లాక్డౌన్ తరహాలో కర్ఫ్యూ అమలయ్యేలా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆంక్షలు ప్రారంభం అవుతున్నాయి.
ఆ సమయానికి రహదారులపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. రాకపోకలు నిషేధిస్తున్నారు. దీంతో ఒంటి గంట వరకు నగరం నిర్మానుష్యంగా మారుతోంది. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో ప్రభుత్వ నిబంధనలకు ప్రజలందరూ సహకరించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. కొవిడ్ జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: