వర్షాల ధాటికి పంట నాశనమైన రైతులకు నెల్లూరులోని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నరసోజీ రావు తీపి కబురు అందించారు. సెప్టెంబరులో కురిసిన వానల వల్ల పంట కోల్పోయిన అన్నదాతలకు నాలుగైదు నెలల్లో పరిహారం అందుతుందని వెల్లడించారు. బ్యాంకు ఖాతాలో నగదు జమ అయిన వెంటనే రైతులు తమకు తెలియచేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 2,772 మంది కర్షకులు, రూ. 2 కోట్ల 83 లక్షల మేర నష్టపోయినట్లు.. ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు.
వరి, వేరుశనగ, మినుము, పెసర పంటలు గత నెలలో వానలకు భారీగా దెబ్బతిన్నాయని నరసోజీ రావు పేర్కొన్నారు. వరి-1767, వేరుశనగ-107, కంది-9, పెసర-7, మొక్కజొన్న-2 హెక్టార్ల చొప్పున మొత్తం 1,902 హెక్టార్లలో రైతులు నష్టపోయారని వివరించారు.
ఇదీ చదవండి: నెల్లూరులో ఉద్రిక్తత... నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట