ETV Bharat / state

పంటలు మునిగి ఒకచోట, ఎండిపోయి మరోచోట - రాష్ట్రంలో దయనీయంగా రైతు పరిస్థితి

రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతుకు నిరాశ మిగులుతుంది. సర్కారు ముందు చూపు లేకపోవడంతో పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు లబోదిబోమంటున్నారు. తమను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 8:09 PM IST

crop_loss_farmers
crop_loss_farmers

Crop Loss to Farmer in AP : రైతులు ఉదయం లేవగానే నాగలిని చేత పట్టి, భూమిని దుక్కిదున్ని నారు పోసి పంటను పండిస్తారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చూసుకొని తన కష్టం అంతా మార్చిపోతారు. అదే పంటకు చీడ తగిలిన తట్టుకోని రైతు, తన కళ్ల ఎదుట పంట మునిగిపోయి, ఎండిపోయి కనిపిస్తుంటే ఆ రైతుల మానసిక బాధను మాటల్లో చెప్పలేం. పాలకుల ముందుచూపు లేమి కారణంతో ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇంచు మించు ఇలానే ఉంది. ఒకవైపు అతివృష్టి కారణంగా పండించిన పంట మునిగిపోతే, మరోవైపు అనావృష్టి కారణంగా పంట ఎండిపోతుంటే దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఉన్నారు.

మొలకెత్తిన వరి పనలు - చేలల్లోనే పంటను దున్నేస్తున్న రైతులు

Farmer Protest in Nellore District : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామ రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట చేపట్టారు. మండలానికి కూతంతా దూరంలో ఉన్న సోమశిల జలాశయం నీటిని విడుదల చేస్తామని అధికారులు, నాయకులు చెప్పిన తరవాతనే వరి నారు వేసుకున్నామని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు నారు మడులు వేసుకున్నాక నీరు వదలడానికి మొహం చాటేసారంటూ ఉద్ఘాటించారు. అధికారులు, నాయకుల చూట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. అదిగో నీరు, ఇదిగో నీరు అంటూ కాలయాపన తప్ప ఎలాంటి ప్రయోజనం చేర్చలేదని తెలియజేశారు. వారి మాటలు, చేష్టలు కారణంగానే రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నామని వెల్లడించారు. సోమశిల జలాశయం నుంచి ఉత్తర కాలువకు నీరు ఇచ్చిన అధికారులు, దక్షిణ కాలువకు నీటిని విడుదల చేయాడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారో ప్రశ్నించారు. వారి నిర్లక్ష్యం కారణంగా వరినార్లు ఎండిపోతున్నాయని, వెంటనే నీరు వదలాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. రైతులు రహదారిపై బైఠాయించి సుమారు రెండు గంటలు అవుతున్నా, భారీగా వాహనాలు నిలిచిపోయినా సంబంధిత అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదలమని వ్యాఖ్యానించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంత నచ్చచెప్పినా రైతులు వినకపోవడం వల్ల సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన - ప్రతి ఒక్క రైతుని ఆదుకోవాలని టీడీపీ నేతల వినతి పత్రాలు

Cyclone Effect : పంట చేతికందే సమయంలో మిగ్​జాం తుపాను నిండా ముంచిందని ఉంగుటూరు మండలం చాగంటిపాడు, నందమూరు వరి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోసిన వరి పనలు నీళ్లలో నానడం వల్ల ధాన్యం పూర్తిగా మొలకలు వచ్చాయని వాపోయారు. తుపాను కారణంగా నష్టపోయి పది రోజులు అయినా తమని ఏ అధికారి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చేసేదేమీ లేక సుమారు 15 ఎకరాల వరి కుప్పలను దున్నాల్సిన పరిస్థితి నెలకొందని బోరుమంటున్నారు. ఎకరాకు 35 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టామని వాపోయారు. వరద నీరు దిగువకు పోయేందుకు సరైన మార్గం లేకపోవడం వల్ల పంట పొలాల్లోనే నీరు నిలిచిపోయిందని పేర్కొన్నారు.తుపాను కారణంగా పంట నష్టపోయి ఒకరు, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటను పండించలేక మరొకరు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి ఇరువురిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుంది.

రైతు జీవితాలతో ఆడుకుంటున్న వాతావరణ పరిస్థితులు - ఇక రైతుకు దిక్కు ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.