ఆత్మకూరు నియోజకవర్గంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు కుదేలయ్యారు. కోత దశలో ఉన్న వరి పంట అకాల వర్షంతో తడచిపోగా... మరోపక్క కోసిన బియ్యం రోడ్లపైన రాసులుగా పోయడం వల్ల తడిసిపోయింది. సంగం మండలంలో చేతికి వచ్చిన అరటితోట ఈదురు గాలుల బీభత్సానికి నేలకొరిగింది. ఆత్మకూరు మండలం అప్పారావు పాళెం గ్రామంలో ఈదురుగాలులకు మామిడి కాయలు కిందపడిపోయాయి. అనంతసాగరం మండలంలో మిర్చి, చెనగ మినుము పంట తడిసింది. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
గూడూరులో...
గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో గురువారం కురిసిన వర్షానికి నువ్వుల పంట పొలాల్లో ఉండగా తడిసిపోయింది. ఉదయానికి మొలకలు రావడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందనే ఆశతో గూడురు రైతులు ఎదురుచూస్తున్నారు.
సుమారు రూ.3 కోట్ల నష్టం..
గురువారం నెల్లూరు జిల్లాలో కురిసిన అకాల వర్షానికి ఉద్యాన పంటలైన అరటి, మిరప, ఆకు తోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని ఉద్యాన శాఖ ప్రాథమిక అంచనా వేసింది. వీటి విలువ సుమారు 3 కోట్ల రూపాయల నష్టం ఉంటుందని అధికారులు అంటున్నారు. అదే విధంగా వరి, వేరుశనగ, పత్తి పంటల నష్టానికి సుమారు 70 లక్షల విలువ ఉండవచ్చని చెబుతున్నారు.
ఇదీ చదవండి: