నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతీయ వైద్యశాలలో అమానవీయ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి ప్రాణాపాయ స్థితిలో వచ్చిన ఓ అధ్యాపకుడికి డ్యూటీ డాక్టర్ ఇంజెక్షన్ వేసి వదిలేశారు. బాధితుడికి రోడ్డు ప్రమాదంలో తల, కాళ్లకు తీవ్ర గాయాలవగా సెక్యురిటీ గార్డులు, స్వీపర్లే బ్యాండేజీ కట్టారు. అక్కడినుంచి నెల్లూరు జీజీహెచ్‌కు తరలిచేందుకు స్ట్రెచర్‌లో తీసుకెళ్తుండగా ఆ బ్యాండేజీ సైతం ఊడింది. ఆత్మకూరు ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడం, డ్యూటీ డాక్టర్ ఉన్నా సరిగా స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: Road Accident: నెల్లూరు-తిరుపతి బస్సు బోల్తా... ఒకరు మృతి, 15 మందికి గాయాలు