ప్రజాస్వామ్యానికి మొదటి శత్రువు ప్రధాని మోదీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. నెల్లూరు జిల్లా గూడూరులో మాట్లాడిన ఆయన... ఇతర దేశాల వారి కంటే మన దేశంలోనే దేశ ద్రోహులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. దేశంలో అప్రజాస్వామిక పాలన సాగుతుందన్నారు. ప్రత్యేక హోదా కొంతమందికి ఆపత్కాలంలో ఆదుకునే వస్తువుగా మారిందని.. దాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు 10 మందికి పైగా మరణిస్తే కేసీఆర్ ప్రభుత్వానికి చలనం లేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో యురేనియం తవ్వకాలను జరగనివ్వబోమని.. ప్రజలను ఇబ్బంది పెడితే పోరాటం తప్పదని హెచ్చరించారు.
ఇవీ చదవండి..