కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నెల్లూరు నగరంలోని 43, 47వ డివిజన్లను అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఈ డివిజన్ పరిధిలోని కొంతమంది దిల్లీలో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. డివిజన్ ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రజలెవరినీ బయటకు రానివ్వకుండా, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు తాము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 64మందిని ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ సూచనలను పాటిస్తే.. వైరస్‌ను నిర్మూలించవచ్చన్నారు.
ఇదీచదవండి