ETV Bharat / state

సదుపాయాలు లేవని కరోనా బాధితుల ఆందోళన - gudur covid care center latest news

వేడి నీళ్లు కాదు కదా.. మంచి నీరు కూడా లేదు.. సరైన సదుపాయాలు లేవు..మరుగుదొడ్లు శుభ్రం చేయటం లేదు..మేము ఇక్కడ ఉండలేము.. హోం క్వారంటైన్​లో ఉంటామంటూ నెల్లూరు జిల్లా గూడూరు కొవిడ్ కేర్​లో ఉంటున్న కరోనా బాధితులు వేడుకుంటున్నారు.

corona patients agitation
కరోనా బాధితుల ఆందోళన
author img

By

Published : Aug 8, 2020, 8:59 PM IST

కరోనా బాధితుల ఆందోళన

గూడూరు కొవిడ్ కేర్ సెంటర్​లో సదుపాయాలు సరిగ్గా లేవని కరోనా పాజిటివ్ బాధితులు నిరసనకు దిగారు. వేడినీళ్లు కాదు కదా.. మంచినీరే లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భోజనాలు సరిగ్గా పెట్టడం లేదని.. వైద్యం అందటం లేదని ఆరోపించారు. మందులు సైతం సమయానికి ఇవ్వటం లేదని వాపోయారు. ముఖ్యమంత్రిగా జగన్​ను గెలిపించినందుకు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. ఇటువంటి పరిస్థితుల్లో కొవిడ్ కేర్ సెంటర్​లో ఉండలేమనీ.. తమకు హోం క్వారంటైన్​లో ఉంటామని.. ఇళ్లకు పంపించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: నాయుడుపేట పురపాలక సంఘంలో విస్తరిస్తున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.