ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కూలీ ఖర్చులు... మిగిలిన వ్యయప్రయాసలు

మహమ్మారి కరోనా... అన్ని రంగాలను దెబ్బ తీసింది. ఇప్పుడా ప్రభావం వ్యవసాయంపై పడింది. కూలీలతో మెుదలుకొని అన్ని ఖర్చులు పెరగటంతో పెట్టిన పెట్టుబడైనా వస్తుందో..! రాదో..! అన్న దిగులు రైతన్నను వెంటాడుతోంది. వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర రాకుంటే తమ పరిస్థితి ఏంటని రైతులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లాలో పెరిగిన వ్యవసాయ ఖర్చులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

పెరిగిన కూలీ ఖర్చులు...మిగిలిన వ్యయప్రయాసలు

author img

By

Published : Nov 18, 2020, 4:33 PM IST

నెల్లూరు జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. భారత ధాన్యాగారంగా గుర్తింపు పొందిన జిల్లాలో 68 శాతం మంది రైతులు వరిని సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏడాది రబీలో 7 లక్షల ఎకరాలు, ఖరీఫ్​లో 3 లక్షల ఎకరాలు సాగవుతోంది. అయితే.. ఈ ఏడాది ప్రారంభం నుంచే కరోనా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. ఖరీఫ్​లో కూలీల నుంచి ఎరువులు, విత్తనాలు అన్నింటిపైనా అదనపు మొత్తం చెల్లించాల్సిరావటం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం రబీ సీజన్ ప్రారంభమై.. ముమ్మరంగా వరి నాట్లు జరుగుతున్నాయి. కరోనా వచ్చి 10 నెలలవుతున్నా.. ఇప్పటికీ పెట్టుబడి ఇబ్బందులు రైతులను వెంటాడుతున్నాయి. దుక్కి దున్నడం నుంచి నాట్లు వేసే వరకు కూలీల ఖర్చు పెరగటం వల్ల రైతులు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు.

గత ఏడాది రూ. 300 ఉన్న కూలీ ధరలు ఇప్పుడు రూ. 500 నుంచి 600 చేరింది. స్థానికంగా కూలీలు దొరక్కపోవటం వల్ల, పొరుగు ప్రాంతాలు, జిల్లాల నుంచి కూలీలను రప్పించుకుంటున్నారు. ఈ ఏడాది తమకు సాగు కలిసి రావటంలేదని.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర వస్తేనే, తాము గట్టెక్కుతామని అన్నదాతలు వాపోతున్నారు.

ఇదీ చదవండి:

అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.