ETV Bharat / state

తికమక! పాజిటివ్‌ వ్యక్తుల గుర్తింపులో సమస్య - nellore doctors are careless to to find covid positive cases

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం ఆ అంశంపైనే దృష్టి పెట్టి పనిచేస్తోంది. కానీ, పాజిటివ్‌ వ్యక్తుల గుర్తింపులో సమస్య ఎదుర్కొంటున్నారు. కొంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో బాధితులను గుర్తించడంలో గందరగోళం ఏర్పడుతోంది. నమూనా నివేదికొచ్చిన ప్రతిసారీ ఇదే తంతు. దీంతో బాధితులు ఆందోళనకు గరవుతున్నారు.

nellore district
తికమక! పాజిటివ్‌ వ్యక్తుల గుర్తింపులో సమస్య
author img

By

Published : Apr 14, 2020, 4:50 PM IST

నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ ఫలితాలు వెల్లడైన ప్రతిసారీ బాధితులను గుర్తించడం అధికారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యంతో ఇక్కడ ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతోంది. లోతుగాచూస్తే, ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం ఆ అంశంపైనే దృష్టి పెట్టి పనిచేస్తోంది. ఓ దశలో వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి మరీ ఈ విపత్తును ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో అధికారికి ఒక్కో రకమైన విధులను అప్పగించారు. కొందరు క్వారంటైన్‌ సెంటర్లు పర్యవేక్షిస్తూ ఉండగా.. మరికొందరు బాధితుల గుర్తింపు చేపడుతున్నారు. ఇంకొందరు కేంద్రాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. కరోనా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ కేంద్రాలకు పంపించి త్రోట్‌ స్వాబ్‌, రక్తనమూనాలు సేకరించి తిరుపతి స్విమ్స్‌కు పంపిస్తున్నారు. అక్కడ పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా పాజిటివ్‌ కేసుల గుర్తింపు జరుగుతోంది. అయితే ఇక్కడే సమస్య ఏర్పడింది.

ఇదీ పరిస్థితి

జిల్లాలో కరోనా అనుమానితులను క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తున్న అధికారులు.. వారి త్రోట్‌స్వాబ్‌ సేకరించి పరీక్షలకు పంపిస్తున్నారు. అయితే, ఇక్కడే నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం గమనార్హం. ప్రతి క్వారంటైన్‌ కేంద్రంలోనూ అనుమానితుడి నుంచి నమూనా సేకరించినప్పుడు దానికి ఆ వ్యక్తి వివరాలు జోడించి పక్కాగా నమోదు చేసుకోవడం విధి. ఆ నమూనాకు ఇచ్చే ప్రత్యేక కోడ్‌ను రిజిస్టర్‌ లేదా కంప్యూటర్‌లో ఎంటర్‌ చేసుకోవడంతో పాటు.. ఆ వ్యక్తి పేరు, చిరునామాతో పాటు ఫోన్‌నంబరు, ఆధార్‌కార్డు నంబరు, ఫొటో తదితరాలు పొందుపరిస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బాధితులు సరైన సమాచారం ఇవ్వడానికి మొగ్గుచూపని క్రమంలో ఆధార్‌కార్డు నంబరు అధికారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్విమ్స్‌ అధికారులు నమూనా సంఖ్య వారీగా ఫలితాలు వెల్లడించిన అనంతరం.. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల కోడ్‌ ఆధారంగా జిల్లా అధికారులు పరిశీలిస్తే క్షణాల్లో వారిని గుర్తించవచ్ఛు మొక్కుబడిగా వివరాలు తీసుకుని నమూనాలు పంపించేస్తుండగా.. ఫలితాలు వెల్లడైన అనంతరం వ్యక్తుల వివరాల కోసం పాట్లు పడాల్సి వస్తోంది.

పొంచి ఉన్న ప్రమాదం

రాష్ట్ర అధికారులు కరోనా బులెటిన్‌ విడుదల చేసిన ప్రతిసారీ జిల్లాలో పాజిటివ్‌ కేసుల గురించి తెలుసుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఓ దశలో ఒకే పేరుతో నలుగురైదుగురు ఉన్న క్రమంలో వారిలో ఎవరికి పాజిటివ్‌ ఉందో తెలియక తలపట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఏ ప్రాంతమో కూడా అర్థం కాని దుస్థితి. గత పక్షం రోజుల్లో జరిగిన ఘటనలే ఉదాహరణగా చెప్పొచ్ఛు పది రోజుల క్రితం ముగ్గురికి పాజిటివ్‌ ఉన్నట్లు రాగా.. నాయుడుపేట, రాపూరు రెండు ప్రాంతాలకు చెందిన వ్యక్తులుగా చర్చకు వచ్చింది. చివరకు నాయుడుపేటగా తేల్చారు. ఇక్కడ ఒకే పేరుతో ఐదుగురు ఉండటంతో సమస్య ఏర్పడిందన్నది అధికారుల మాట. ఐదురోజుల క్రితం కూడా ఇలాగే తోటపల్లిగూడూరుకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు హడావుడి ప్రచారం జరిగింది. చివరకు నాయుడుపేట, నెల్లూరుకు చెందిన వారుగా గుర్తించారు. ఇలా చెప్పుకుంటూపోతే అనేక ఘటనలు ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం మధనపడుతూ ఉన్నారు. చివరకు అధికారుల తికమక ప్రమాదాన్ని పొంచి ఉండేట్లు చేస్తోంది. నెగెటివ్‌ వచ్చిన వ్యక్తిని పొరపాటున పాజిటివ్‌ కేసు కింద పరిగణించి ఐసోలేషన్‌కు తీసుకెళ్లినా.. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని నెగెటివ్‌ కింద గుర్తించి విడిచిపెట్టినా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి వివరాలు పక్కాగా నమోదయ్యేలా చూడాల్సి ఉంది. ఈ విషయమై.. పేర్ల విషయంలో కొంత ఇబ్బంది ఎదురవుతున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి రాజ్యలక్ష్మితో చెప్పారు. పక్కాగా నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇది చదవండి కరోనా అనుమానిత లక్షణాలతో వైద్యుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.