స్వచ్ఛ నెల్లూరు సహకారానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ వెల్లడించారు. ముందుగా నగరంలోని 16, 51వ డివిజన్లను మోడల్‌గా ఎంపిక చేసి స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. డివిజన్లను 15రోజుల్లో బిన్ ఫ్రీగా తీర్ఛిదిద్ది, మరో పది డివిజన్లను 45 రోజుల్లో పరిశుభ్రంగా మారుస్తామన్నారు. ఏడాదిలోగా నెల్లూరును దేశంలోనే స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎవరైనా రహదారులపై చెత్త పడేస్తే జరిమానాలు విధిస్తామన్నారు. ప్రజల సమస్యలను కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సామాజిక మాధ్యమాల ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు.
ఇవీ చదవండి: ఆక్వా రైతాంగం.. వారి పరిస్థితి దయనీయం!