సీఎం నెల్లూరు పర్యటనకు సర్వం సిద్ధం ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటనకు సర్వం సిద్ధమవుతోంది. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ వేదికగా రేపు సీఎం "రైతు భరోసా" పథకం ప్రారంభిచనున్నారు. సభాస్థలి ఏర్పాట్లను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. వేలాదిమంది రైతులు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. హాజరయ్యే వారి సంఖ్య భారీగా ఉంటుందనే అంచనాలతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ ప్రాంతంలో ఎంతమంది భద్రతా సిబ్బందిని నియమించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇదీ చదవండి
అర్హత సాధించినా.... నియామక పత్రాలు అందలేదు