భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆందోళన చేపట్టింది. నెల్లూరులోని.. పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటిని ముట్టడించి ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ఇతర పనులకు కేటాయించకూడదని చట్టం చెబుతున్నా, నిధులు దారి మళ్లిస్తున్నారని సీఐటీయూ నేత మాదాల వెంకటేశ్వర్లు ఆరోపించారు.
కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న భవన కార్మికులను ప్రభుత్వం ఆదుకోకపోవడం దారుణమన్నారు. వేరే పథకాలకు మళ్లించిన నిధులు వెంటనే సంక్షేమ నిధికి జమ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో పనులు కోల్పోయిన కార్మికులకు జీవన భృతి కింద రూ.పది వేలు ఆర్థిక సహాయం, ఆరు నెలల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి క్యాంపు కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి : లౌకికవాదిగా ఉండాల్సిన బాధ్యత సీఎంపై ఉంది : మాజీమంత్రి జవహర్