నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు గ్రామం వద్ద జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి ఆలయం తాళాలను అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించారని... ఉత్సవ విగ్రహంతో పాటు అమ్మవారి విగ్రహం పై ఉండే ఆభరణాలను తీసుకెళ్లారని అర్చకులు తెలిపారు. ఆలయం వద్ద శుభ్రం చేసేందుకు వచ్చిన వాచ్మెన్, పని మనిషి ఈ విషయాన్ని గమనించి గ్రామస్థులకు తెలిపారు. వారు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కలిగిరి ఎస్సై వీరేంద్ర తెలిపారు.
ఇదీ చూడండి