ETV Bharat / state

ఇద్దరు బాల కార్మికుల గుర్తింపు..ఆశ్రమ పాఠశాలలో చేరిక - నెల్లూరులో బాలకార్మికులకు విముక్తి

బాతులను కాపల కాస్తున్న ఇద్దరు చిన్నారులకు విముక్తి లభించింది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఇద్దరు చిన్నారులను నెల్లూరు జిల్లా చెల్లాయిపాలెంలో వ్యాపారులు బాతులకు కాపలగా ఉంచారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ వారిని ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు.

బాల కార్మికులను ఆశ్రమ పాఠశాలలో చేర్పించిన అధికారులు

author img

By

Published : Sep 22, 2020, 9:22 PM IST

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయిపాలెంలో బాల కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి బాతుల వ్యాపారులు ఇద్దరు చిన్నారులను బాతుల కాపల కోసం తీసుకువచ్చారు. తండ్రి చనిపోయి..తల్లి వదిలేసిన ఆరు, ఎనిమిది సంవత్సరాల వయసున్న బాలలను బంధువులు రూ.20 వేలు తీసుకొని బాతుల వ్యాపారులకు అప్పగించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి వారికి విముక్తి కల్పించి ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు.

ఇదీచదవండి

'కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.