ETV Bharat / state

Ramayapatnam : 'పోర్టుకు భూములిచ్చాం.. ఇప్పుడు మరో పరిశ్రమ అంటే ఎలా..!'

author img

By

Published : Apr 25, 2023, 8:58 PM IST

Chevuru Village Problem : నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు, పరిశ్రమ నిర్మాణానికి సాగు భూమలు కావాలంటూ అధికారులు కోరడాన్ని చేవూరు రైతులు వ్యతిరేకించారు. పోర్టు నిర్మాణం కోసం సహకరించాలని కోరుతూ బలవంతంగా భూములు లాక్కుంటున్నారని వాపోయారు. అభివృద్ధి పేరుతో ఏళ్ల తరబడి నివాసాలు ఉన్న వారికి మొక్కుబడి పరిహారంతో బయటకు పొమ్మంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Etv Bharat
Etv Bharat

Chevuru Village Problem : నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు సాగుతున్నాయి. పోర్టు పరిధిలోని ప్రధాన గ్రామం చేవూరు...అక్కడ సుమారు 5వేల జనాభా నివసిస్తున్నారు. పోర్టు నిర్మిస్తే సమీప గ్రామాలు అభివృద్ది చెంది ఉపాధి లభిస్తుందన్న ఆశతో పోర్టులోకి రోడ్డు నిర్మాణం చేసేందుకు...110 ఎకరాల భూములు ఇచ్చారు. రోడ్డు నిర్మాణం పూర్తయినప్పటికీ నేటికీ కొందరికి పరిహారం అందలేదు. మరో వైపు పోర్టు సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రైతులు సాగు చేసుకుంటున్న భూములు కావాలని ప్రభుత్వ అధికారులు కోరడంతో గ్రామస్థులు దానిని వ్యతిరేకించారు. దీంతో ఆ గ్రామంలోని భూములు రిజిస్టేషన్లు ఎనిమిది నెలలుగా నిలిపివేశారని అత్యవసర పరిస్థితుల్లో భూములు అమ్మేందుకు వీలులేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు రోడ్డు కోసం భూములు తీసుకున్నారని, పరిశ్రమ కోసం సాగుచేసుకునే భూములు లాక్కుంటున్నారని వారి బాధలను వివరిస్తున్నారు.

మా భూములకు సరైన నష్టపరిహారం ఇవ్వండి తీసుకుంటే మేము ఎలా బతకాలి : చేవూరు గ్రామం జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. కనుక ఎకరా కోటి రూపాయలకు పైగా ధర పలుకుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర 21లక్షల70వేలు ధరకు భూములు ఇచ్చేది లేదని అంటున్నారు. మధ్యమార్గంగా కనీసం 50లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సాగు భూములను పోర్టు, పరిశ్రమ కోసం తీసుకుంటే మేము గ్రామంలో ఉండి ఉపయోగంలేదని గ్రామస్తులు అంటున్నారు.
ఉపాధి లేకుండా మేము ఎలా బతకాలి : అలాగే చేవూరు గ్రామంలో 3వేల మంది కూలీలు ఉన్నారు. వారంతా సమీపంలో ఉన్న1000ఎకరాల మేర ఉన్న పొలాల్లో.. మామిడితోటల్లో కూలి పనులు చేసుకుంటున్నామని ఈ భూములు కోల్పోతే తమకి ఉపాధి దొరకదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఉన్న మామిడి తోటలు పూర్తిగా కోల్పోతామని చెబుతున్నారు. నష్టపరిహారం ఇచ్చి, ఇళ్లు కూడా తీసుకుని పునరావాస కాలనీ నిర్మాణం చేసివ్వాలని కోరుతున్నారు. అంతే కాకుండా వ్యవసాయ కూలీలకు కూడా పరిహారం అందించాలని.. అసైన్డ్ భూములు, చుక్కల భూముల రైతులకు కూడా ఎకరాకి 15లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే తమపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్.ఆండ్ ఆర్ ప్యాకేజి కింద చేవూరు గ్రామాన్ని తీసుకుంటే మొత్తం తీసుకోవాలని తెలిపారు. దాంతో పాటు జాతీయ రహదారి పక్కన ఉన్న భూముల ధరతో పోల్చి అందులో సగం ధరను పరిహారంగా ఇవ్వాలని కోరుతున్నారు. తమను మభ్యపెట్టి తక్కువ ధరలు ఇస్తే భూ సేకరణను అడ్డుకుంటామని అధికారులను హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.