రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నెల్లూరు టూరిజం హోటల్లో దివ్యాంగ ఉద్యోగిని ఉషారాణిపై దాడి ఘటనకు సంబంధించి ఏడు రోజుల్లోనే చార్జిషీట్ దాఖలైంది. ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసును దిశ పోలీసులకు అప్పగించడంతో పూర్తిస్థాయిలో విచారించిన పోలీసులు సాక్ష్యాధారాలతో 7 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేశారు.
నిర్భయతోపాటు ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు దిశ స్టేషన్ డీఎస్పీ నాగరాజు తెలిపారు. దిశ యాక్ట్ ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదని, అయినా తాము మహిళలకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. దివ్యాంగ మహిళా ఉద్యోగి ఉషారాణిపై పాశవికంగా దాడి చేసిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌కు కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి