నెల్లూరు జిల్లా పైడేరు కాల్వలో వైకాపా నేతలు మట్టి మాఫియాను ప్రశ్నించినందుకు కొడవలూరు మండలం కమ్మపలేం గ్రామానికి చెందిన కరాకట మల్లికార్జున్‌పై నలుగురు వైకాపా కార్యకర్తలు దాడి చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కొడవలూరు పోలీసులు మల్లికార్జున్పైనే తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయటంతో పాటు అతనిపైనే రౌడీషీట్ తెరిచారని తప్పుబడుతూ డీజీపీకి లేఖ రాశారు. ఒక ఎస్సీ యువకుడిని వేధించేందుకు పోలీసులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి ఇలా చేయటం దుర్మార్గమని దుయ్యబట్టారు.
పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ లేనివిధంగా పోలీసు చర్యలు ఉన్నాయని ఆరోపించారు. అసలు నేరస్థులపై వెంటనే చర్యలు తీసుకుని మల్లికార్జున్‌పై దాఖలైన తప్పుడు కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. మల్లికార్జున్‌ను తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నించిన కొడవలూరు పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. మల్లిఖార్జున్‌పై దాడికి సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు లేఖకు జత చేశారు.
ఇదీ చదవండి: యూట్యూబ్‌లో చూసి.. నేరాలు నేర్చుకుంటున్నారు!