ETV Bharat / state

ఆనందయ్య మందు.. సీసీఆర్‌ఏఎస్‌ నివేదికే కీలకం!

కృష్ణపట్నం ఆనందయ్య మందు ఆయుర్వేదం కానప్పటికీ... హానికరం మాత్రం కాదని ఆయుష్ రాష్ట్ర కమిషనర్ రాములు ప్రకటన మరోసారి అందరి దృష్టినీ భారతీయ వైద్య విధానాలపై మళ్లేలా చేసింది. సంప్రదాయ వైద్యాన్ని అనుసరించేవారు.. ఆయుర్వేదం, మూలిక వైద్యం, గృహ వైద్యం పట్ల ఆశాజనకంగా ఉన్నారు.

ఆనందయ్య మందు.. సీసీఆర్‌ఏఎస్‌ నివేదికే కీలకం!
ఆనందయ్య మందు.. సీసీఆర్‌ఏఎస్‌ నివేదికే కీలకం!
author img

By

Published : May 24, 2021, 10:04 PM IST

Updated : May 24, 2021, 10:17 PM IST

ఆనందయ్య మందు 18 రకాల మూలిక మిశ్రమాలతో తయారైన గుణాత్మకమైన మందేననే అభిప్రాయం ఆయుష్ వ్యక్తం చేస్తోంది. కానీ దీనికి శాస్త్ర ప్రామాణికత మాత్రం ఇంకా లేదు. 'ది సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చిఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్‌సెస్‌' పరిశీలనలో మాత్రం తేలనుంది.

ప్రాణాంతకమైన కరోనా.. నుంచి బయటపడేందుకు ఆనందయ్య ఉచిత మందును వాడాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన చాలా మందికి ఆయుష్ తాజా ప్రకటన మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది. నాలుగైదు రోజుల్లో 'ది సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చిఇన్‌ ఆయుర్వదిక్‌ సైన్‌సెస్‌' ( సీసీఆర్‌ఏఎస్‌) ఆనందయ్య మందులో మూలిక గుణాలను విశ్లేషించి సమగ్ర నివేదికను ఇవ్వనుంది. ఇందుకోసం రాష్ట్రంలోని ఆయుర్వేద కళాశాలలు, అందులోని అధ్యాపకులు, విద్యార్థుల సహకారం కూడా సీసీఆర్ఏఎస్ తీసుకుంటోంది.

ఇప్పటివరకు కృష్ణపట్నంలో జరిపిన పరిశీలన, ఆనందయ్య మందు వాడిన వారి అభిప్రాయలు, మందులో ఉన్న గుణాలను ఆయుష్ కమిషనర్.. సీఎం జగన్​కు తెలియజేశారు. సీసీఆర్‌ఏఎస్‌ వారు ఇచ్చే నివేదిక తరువాతే.. ఆనందయ్య మందు వాడకంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వనుందని రాములు వెల్లడించారు. అప్పటివరకు కృష్ణపట్నంలో ఆనందయ్యకు ఇస్తున్న భద్రత కొనసాగిస్తామని నెల్లూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు.

ఇదీ చదవండి: హైవే కిల్లర్‌ మున్నా కేసులో సంచలన తీర్పు.. 'నైలాన్ తాడుతో గొంతులు కోసేవాడు'

Last Updated : May 24, 2021, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.