గిట్టుబాటు ధర రాక విలవిల్లాడుతున్న పొగాకు రైతును కరోనా ప్రభావం మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. వైరస్ ప్రభావంతో ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయని పొగాకు బోర్డు చెప్పటంతో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పొగాకు కేంద్రం వద్దకు తీసుకువచ్చిన పొగాకు బేళ్లను కొనేవారు లేక ఉసూరుమంటూ ఇంటికి తిరిగి తీసుకువెళ్తున్నారు. కరోనా అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని.. పొగాకు రైతులకు బోర్డు ఎప్పుడూ గిట్టుబాటు ధర కల్పించటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించి తమను ఆదుకోవాలని పొగాకు రైతులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: