నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంస్థల నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా రాజధాని దిల్లీలో పోరాడిన ప్రజలపై.. మారణకాండ జరిగిన తీరును నిరసించారు. విచక్షణారహితంగా దాడులకు పాల్పడి 40 మంది చావుకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సెంటర్ నుంచి బీఎస్ఆర్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. దేశంలోని అత్యధికులు వద్దని చెబుతున్నా.. ఎన్ఆర్సీని ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. భాజపా నేతలు.. అధికారం కోసం మతాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదని చెప్పారు.
ఇదీ చదవండి: