ETV Bharat / state

Nellore YSRCP Crisis నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది.. తాజాగా బాబాయ్ అబ్బాయ్ గోల..! నిర్వేదంలో పార్టీ శ్రేణులు - రూప్‌కుమార్‌ యాదవ్‌

Roop Kumar Yadav: నెల్లూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలే రచ్చకెక్కి ఆదిపత్యపోరులో బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. నిన్నమెున్నటివరకు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో సతమతమైన వైసీపీకి.. అనిల్ యాదవ్, రూప్‌ కుమార్‌ యాదవ్​ల​ ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరింత తలపోటుగా మారుతున్నాయి.

Roop Kumar Yadav
వైకాపా వర్గపోరు
author img

By

Published : May 20, 2023, 10:01 PM IST

Anil Kumar Yadav: నెల్లూరు నగరంలో అధికార పార్టీలో వర్గపోరు దాడులకు దారితీసింది. ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఆయన బంధువు రూప్ కుమార్ యాదవ్ మధ్య..ఆధిపత్యపోరు కొనసాగుతున్న వేళ.. ఓ వైకాపా నాయకుడిపై దాడి విభేదాలను మరింత రాజేసింది. ఎమ్మెల్యేనే దాడి చేయించారని ఆరోపించిన రూప్‌కుమార్‌ యాదవ్‌.. ప్రతికార చర్యలు మొదలుపెడితే ఊహకు అందని పరిణామాలుంటాయని హెచ్చరించారు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని అనిల్‌ వ్యాఖ్యానించడంతో నెల్లూరు రాజకీయం వైకాపాలో చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పార్టీపై ధిక్కార స్వరంతో నెల్లూరు రాజకీయాలపై ఇప్పటికే కలవరపడుతున్న వైసీపీ పెద్దలకు..ఎమ్మెల్యే అనిల్‌, ఆయన బంధువు రూప్‌కుమార్‌ మధ్య విభేదాలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. ఇటీవల నెల్లూరు జిల్లాకు వచ్చిన సీఎం జగన్.. మాజీ మంత్రి అనిల్ కుమార్, ఆయన బాబాయ్ రూప్ కుమార్‌ని పిలిచి నచ్చజెప్పారు. కలిసి ఉంటే కలదు సుఖం అని నచ్చచెప్పారు. అయినా ఇద్దరూ కలవకపోగా వర్గ విబేధాలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా రూప్ కుమార్ అనుచరుడిపై దాడి... మరోసారి ఇద్దరి మధ్య విబేధాలను బయటపెట్టాయి. శుక్రవారం అర్ధరాత్రి వైకాపా విద్యార్ధి నాయకుడు హాజీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి.. హాజీని పరామర్శించారు. తనపై దాడి చేయించింది ఎమ్మెల్యే అనిల్ అని బాధితుడు ఆరోపించాడు. హాజీ, వైకాపా నాయకుడు

రూప్​ కుమార్​: నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఈ దాడి చేయించారంటూ రూప్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. 'అల్పబుద్ధివానికధికారమిచ్చిన...' అనే వేమన పద్యం చదివి.. బహిరంగ విమర్శలు చేశారు. ఇకనుంచి తమ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. షేక్​ హాజీ.. కేవలం రూప్​ కుమార్​తో ఉన్నాడనే కారణంతో అతనిపై దాడి చేయించారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదులు చేసిన.. దాడి చేసిన వారికి రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగనన్ నెల్లూరులో జరుగుతున్న రాజకీయాలపై నివేదిక తెప్పించుకోవాలని రూప్ ​కుమార్ వెల్లడించారు. ఎవ్వరు తప్పు చేసినా.. ఆఖరికి మేము తప్పు చేసినా మాపై చర్యలు తీసుకోండని పేర్కొన్నాడు.

ఎమ్మెల్యే అనిల్ కుమార్: హాజీపై దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే అనిల్ కుమార్ తెలిపారు. తన ఓపికను పరీక్షించవద్దని.. అన్నిటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. సామాజిక మాద్యమాల్లో వచ్చే బెట్టింగ్ రాజు అనే మచ్చ తాను మోస్తున్నానని, ఈ పాపం నాది కాదని అనిల్ యాదవ్ వెల్లడించారు. తనను విమర్శించే వ్యక్తి దేవుని ముందు ప్రమాణం చేస్తాడాని అనిల్ కుమార్ నిలదీశారు. ఇంటర్నేషనల్ నోటీసులు వచ్చి ఉన్నాయని, లీకులు ఇవ్వాలంటే ఎంతసేపు పట్టదన్నారు.

నెల్లూరు నగరంలో రచ్చకెక్కిన వైకాపా వర్గపోరు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.