నెల్లూరు జిల్లా అబ్బిపురం గ్రామంలో అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఘర్షణకు దారి తీసింది. గ్రామానికి చెందిన సంగయ్య అనే రైతుకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి ఇరువైపులా అతని అన్నదమ్ముల భూములు ఉన్నాయి. కొన్నేళ్లుగా పొలాల హద్దుల విషయంలో వారి మధ్య వాగ్వాదం నడుస్తోంది. అధికారులకూ ఒకరికొకరు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఇదే విషయంపై ఆదివారం మరోసారి వివాదం చెలరేగింది. సంగయ్య ఏఎస్ పేటలోని పోలీస్ స్టేషన్లో తమ్ముళ్ల పైన సంగయ్య ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న తమ్ముళ్లు గ్రామ శివారులో కాపు కాచి దాడి చేశారని సంగయ్య కుటుంబీకులు ఆరోపించారు. కత్తులతో విచక్షణారహితంగా శరీరంపై పొడిచి అక్కడి నుండి పరారయ్యారని చెప్పారు. స్థానికులు హుటాహుటిన సంగయ్యను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కత్తి పోట్లు ఎక్కువగా ఉన్నందున మెరుగైన చికిత్సకు నెల్లూరుకు తీసుకువెళ్లారు.
ఇదీ చదవండి: