నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లి సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వింజమూరు మండలం గుండెమడకలకు చెందిన ఓబుల్ రెడ్డి భార్య ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉందని... ఆమె దగ్గరకు వెళ్లేందుకు ప్రసాద్ అనే వ్యక్తితో కలిసి ఓబుల్ రెడ్డి బైక్పై బయల్దేరారు. బండకిందపల్లి మలుపు వద్ద వాహనం అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ ఎడమకాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఓబుల్ రెడ్డికి ముఖంపై గాయమైంది. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరిని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం బంధువులు ఇద్దరిని నెల్లూరుకు తరలించారు.
భార్యను చూసొద్దామని బయల్దేరాడు... ఆసుపత్రిలో చేరాడు... - నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు
బైక్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లి గ్రామ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయాయ్యాయి.