ETV Bharat / state

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం బీసీల ఆందోళన - local body elections

నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ సంక్షేమ సంఘం నిరసన చేపట్టింది. గతంలో మాదిరిగానే స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్​కు వినతి పత్రం అందించారు.

'నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆందోళన'
author img

By

Published : May 13, 2019, 8:44 PM IST

'నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆందోళన'

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారంటూ... నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆందోళన చేపట్టింది. గతంలో మాదిరిగానే బీసీలకు 34శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు తగ్గింపుతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యథావిధిగా కొనసాగించకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Intro:పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైశాఖమాస తిరు కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అధికారులు ఎనిమిది రోజుల పాటు ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తిచేశారు.

Body:అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు ద్వారకా తిరుమల శేషాచల పర్వతం సిద్ధమైంది. ఈనెల 14 నుంచి ఎనిమిది రోజుల పాటు ఉత్సవాలు ఆద్యంతం కన్నుల పండుగగా జరగనున్నాయి. మొదటి రోజు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు , పెండ్లి కుమార్తె లను చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. లోక కళ్యాణార్థం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి జరుపుకోనున్న కళ్యాణ మహోత్సవాల కు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం ఇందుకు తగిన ఏర్పాట్లను పూర్తిచేసింది .స్వామి అమ్మవార్లను వధూవరులుగా చేసేందుకు ఆలయ ముఖమండపంలో ఉత్తరంవైపున పచ్చి పూల మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు .ఆలయ పరిసరాల్లో, క్షేత్రంలో విద్యుత్ దీపాలతో వివిధ దేవతా మూర్తుల కటౌట్లను ,ఎల్ఈడి బోర్డులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ద్వారకా తిరుమల క్షేత్రం విద్యుద్దీప కాంతులతో ప్రకాశిస్తూ ఉంది .సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు శ్రీవారి ఆలయానికి తూర్పు వైపున ఉన్న శ్రీహరి కళాతోరణాన్ని సిద్ధం చేశారు . ఆలయ ప్రాంగణంలో పలుచోట్ల చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు .శ్రీ వారి క్షేత్రానికి వచ్చే భక్తులను కొండపైకి చేర్చడానికి దేవస్థానం ఉచిత బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ఈవో దంతులూరి పెద్దరాజు తెలిపారు .శ్రీవారి నిత్య అన్నదానంలో భక్తులకు రెండు పూటలా అన్నదానం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కళ్యాణ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, అందుకు సరిపడా ప్రసాదాలు సైతం అందుబాటులో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.

Conclusion:ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.