ETV Bharat / state

రెండు రోజులపాటు బ్యాండ్మింటన్ క్రీడాకారుల ఎంపిక - nellore

నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక రెండు రోజులపాటు జరగనుంది.

badminton_selections_ap
author img

By

Published : Jun 10, 2019, 9:27 PM IST

రెండు రోజులు..బ్యాండ్మింటన్ క్రీడా కారుల ఎంపిక

నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక రెండు రోజులపాటు జరగనుందని ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. ఎంపికలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చినట్లు ఆయన తెలిపారు. గతేడాది అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని గుర్తుచేశారు. వారిలో ఆరుగురు బాలురు, నలుగురు బాలికలను ఎంపిక చేశామన్నారు. జిల్లాను బ్యాడ్మింటన్ క్రీడా హబ్​గా మారుస్తామని వెల్లడించారు.

Ap_vsp_06_10_kadilina_Ap_av_dilli_eenadu Visakhapatnam Eenadu contributor Dilleswararao railway station విశాఖపట్నం -న్యూఢిల్లీ వెళ్లాల్సిన న ఏపీ ఏసీ ఎక్స్ప్రెస్ దాదాపు గంటన్నర ఆలస్యంగా విశాఖ నుంచి బయలుదేరింది . ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో విశాఖ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు ఏసీ యూనిట్లలో ఏర్పడిన సాంకేతిక లోపంతో దాదాపు రెండున్నర గంటల పాటు విశాఖలో ఉంచేశారు . అయితే ఉదయం 10 .35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుందని రైల్వే అధికారులు ప్రకటించగా మధ్యాహ్నం 12 గంటల వరకు విశాఖ స్టేషన్ కు ఆ రైలు చేరుకోలేదు. విశాఖ స్టేషన్లో ప్లాట్ నెంబర్ 8 లో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సమయం మించిపోవడంతో 8వ నెంబర్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ రావాల్సి ఉండడంతో చివరి సమయంలో ఏపీ ఎక్స్ ప్రెస్ ను 6వ నెంబర్ ప్లాట్ ఫామ్ కు మళ్లించారు . దీంతో ప్రయాణికులు 8వ నెంబర్ ప్లాట్ ఫామ్ నుంచి 6వ నంబర్ ప్లాట్ ఫాం కు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 12.45 గంటలకు ఆ రైలు విశాఖ నుంచి బయలుదేరి వెళ్ళింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.