నెల్లూరులో ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో చేతి వృత్తిదారుల సంఘం ఆందోళన చేపట్టింది. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న చేతి వృత్తిదారులు ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పనులు లేక జీవనోపాధి కోల్పోయిన వారికి పదివేల రూపాయలు ఇవ్వాలని, నిత్యావసరాలు, బియ్యం పంపిణీ చేయాలని కోరారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. చేతి వృత్తిదారుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే పోరాడుతామని హెచ్చరించారు.
ఇది చదవండి తితిదే ఆస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించం: వైవీ సుబ్బారెడ్డి