ETV Bharat / state

కరోనాకు ఆయుర్వేద మందు.. తిరిగి పంపిణీకి సన్నాహాలు - కరోనాకు కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో.. కరోనాకు ఇస్తున్న హెర్బల్ మెడిసిన్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇది అశాస్త్రీయం అని చెబుతున్న అధికారులు.. మందు తీసుకున్న వారిని విచారించామని, ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదని తమ నివేదికలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వలేదు. కానీ ప్రజల కోరిక మేరకు, ఎమ్మెల్యే కాకాని ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభింకానుంది.

కరోనా మందు తిరిగి పంపిణీ
కరోనా మందు తిరిగి పంపిణీ
author img

By

Published : May 20, 2021, 11:30 PM IST

Updated : May 21, 2021, 10:46 AM IST

కరోనాకు ఉచితంగా ఆయుర్వేద మందు ఇస్తున్నారన్న విషయం తెలుసుకుని.. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు. 15 రోజుల్లోనే సుమారు 50 వేల మంది ఔషధం కోసం వచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో.. మందు పంపిణీ నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. కానీ ప్రజలు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఒత్తిడి మేరకు తిరిగి పంపిణీ చేయాలని నిర్ణయించారు.

వన మూలికలతోనే...

ఆనందయ్య అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా అనేక వ్యాధులకు వన మూలికలతో తయారు చేసిన ఆయుర్వేద మందులు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొవిడ్ విలయం సృష్టిస్తుండగా.. దానికి సైతం మందు తయారు చెశారు. అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్టా, లవంగాలు, వేప ఆకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి, కొండ పల్లేరుకాయలు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింట ఆకులు, తెల్లజిల్లేడు, పూల మొగ్గలు, ముళ్ల వంకాయలతో ఔషధం తయారు చేస్తున్నట్లు ఆ వైద్యుడు తెలిపాడు.

ఇదీ చదవండి: తమిళనాడులో తగ్గని కరోనా ఉద్ధృతి

అందరి నోటా సంతృప్తే...

మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, తెలంగాణ నుంచి సైతం జనాలు భారీగా తరలిరావడంతో అధికారులు స్పందించారు. పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖ, ఆర్డీవో, ఆయుర్వేద వైద్యులు, స్థానిక ఎండీవో, తహసీల్దార్ మొదలైన జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపారు. వారి నివేదికను కలెక్టర్ చక్రధర్ బాబు లోకాయుక్తకు ఇచ్చారు. మందు వాడిన బాధితులతో మాట్లాడామని.. అందరూ ఆయుర్వేద మందుపై పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారని అందులో వెల్లడించారు. ఈ ఔషధంతో ఎలాంటి ఇబ్బంది పడలేదని చెప్పారు. ఆయుర్వేద చికిత్స ప్రక్రియ శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి:

కృష్ణపట్నంలో కరోనా మందు.. పరిశీలిస్తున్న ఆయుష్ నిపుణులు

Last Updated : May 21, 2021, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.