Atmakur Bypoll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. నేడు(గురువారం) జరగనున్న ఉప ఎన్నికకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఉప ఎన్నికల్లో మొత్తం 278 పోలింగ్ కేంద్రాలలో 1200 మంది పోలింగ్ విధులకు హాజరుకానున్నారు. మూడు మిలిటరీ బెటాలియన్లు, ఆరు పోలీస్ పోలీస్ స్పెషల్ ఫోర్స్ టీమ్, ముగ్గురు డీఎస్పీలు, 18 మంది సీఐలు, 36 మంది ఎస్ఐలు,900 మంది స్థానిక పోలీసు సిబ్బందితో కలిపి మొత్తం సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందిని ఈ ఎన్నికల పర్యవేక్షణకు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
" ఆత్మకూరు ఉపఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మొత్తం 279 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. ఇందులో 10 కేంద్రాలను మోడల్‌గా గుర్తించి పోలింగ్ నిర్వహిస్తున్నాం. 123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాను గుర్తించి అందులో మైక్రో అబ్జర్వర్లను నియమించాం. అన్నిచోట్ల వెబ్ క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా సమస్యాత్మక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలను విధుల్లో ఉంచి.. పోలింగ్ నిర్వహిస్తాం. 78 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు. నియోజకవర్గంలోని మొత్తం 2 లక్షలా 13 వేల మంది ఓటర్లకు స్లిప్‌లు అందజేశామన్నారు. మొత్తం ఉప ఎన్నిక నిర్వహణలో 1409 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొటున్నారని.. పోలింగ్ భద్రత కోసం 11 వందల మంది పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. ఇప్పటి వరకూ 550 లీటర్ల మద్యాన్ని, 14 లక్షల 61 వేల రూపాయలు నగదు సీజ్ చేశాం.
-ముఖేశ్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
గురువారం తెల్లవారుజామున అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ నుంటి బయటకు తీసి.. వాటిని పరిశీలించిన అనంతరం ఆయా పోలీంగ్ కేంద్రాలకు తరలిచనున్నారు. ఉపఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి హారేంద్ర ప్రసాద్, స్థానిక ఆర్డీవో బాపిరెడ్డి పరిశీలించారు.
వైకాపా తరఫున పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఐటీ, పరిశ్రమల మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి నేడు ఉపఎన్నిక జరగనుంది. జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: