ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - ఏపీ ముఖ్యవార్తలు

..

ఏపీ ప్రధాన వార్తలు
AP TOP NEWS
author img

By

Published : Dec 21, 2022, 11:01 AM IST

Updated : Dec 21, 2022, 12:14 PM IST

  • పీకల్లోతు అప్పులు.. ఓడీతో తిప్పలు..ఇదీ ఏపీ ఆర్థిక పరిస్థితి
    రాష్ట్రం ఇంకా ఓవర్‌ డ్రాఫ్ట్‌లోనే ఉంది. రోజువారీ రాబడికి, అవసరాలకు మధ్య పొంతన లేకపోవడంతో.. ప్రస్తుతానికి అప్పులతోనే నెట్టుకొస్తోంది. రిజర్వు బ్యాంకు కల్పించిన అప్పుల వెసులుబాటును వినియోగించుకుంటూ అత్యవసర బిల్లులు చెల్లిస్తోంది. ఈ త్రైమాసికంలో ఇప్పటికే 25 రోజులపాటు ఓడీలోనే ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి
    తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు. పెళ్లి శుభలేఖలు పంచడానికి చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్లిన చంద్రమౌళి.. గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోవడంతో.. చంద్రమౌళి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్ర రైతులపై ఏటా పెరుగుతున్న రుణభారం..
    రాష్ట్ర రైతులపై ఏటా రుణభారం పెరుగుతోందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. లోక్‌సభలో ఓ సభ్యుడు రైతుల అప్పులపై అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా బదులిచ్చింది. తమిళనాడు తర్వాత అత్యధిక వ్యవసాయ రుణ భారం ఆంధ్రప్రదేశ్ రైతుల పైనే ఉందని కేంద్రం ఇచ్చిన లెక్కలతో వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైద్యసేవల కోసమంటూ తీసుకెళ్లి మావోయిస్టులుగా మార్చేస్తున్నారు: ఎన్ఐఏ
    హైదరాబాద్‌కు చెందిన నర్సింగ్‌ విద్యార్థిని రాధపై తీవ్రంగా ఒత్తిడి చేసి మావోయిస్టుల్లో చేర్పించారని ఎన్ఐఏ తెలిపింది. వైద్యసేవల కోసమంటూ చైతన్య మహిళా సంఘం ప్రతినిధులు డొంగరి దేవేంద్ర, దుబాసీ స్వప్న, చుక్క శిల్ప... రాధను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారని ఛార్జిషీట్‌లో పేర్కొంది. వీళ్ల ముగ్గురితో పాటు మరికొందరు కూడా సామాజిక సేవ పేరిట అమాయక యువతులను మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షిస్తున్నారని వివరించింది. దీని వెనుక ఉన్న భారీ కుట్రను వెలికితీసేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బాపట్లలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్​లు పంపిణీ చేయనున్న జగన్​
    తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్​ నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్​ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ట్యాబ్​లు పంపిణీ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మళ్లీ భయం పుట్టిస్తున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలకు కీలక సూచన
    ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య అధికమవుతుండడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో వైరస్‌ జన్యు క్రమ విశ్లేషణకు పాజిటివ్‌ నమూనాలు పంపించాలని అన్నీ రాష్ట్రాలకు సూచనలు జారీచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యూనివర్సిటీల్లో మహిళల ప్రవేశం నిషేధం.. తాలిబన్ ప్రభుత్వం ఆదేశం..
    తాలిబన్​ ప్రభుత్వం మరోసారి మహిళా విద్యార్థుల పట్ల ఆంక్షలు విధించింది. మహిళా విద్యార్ధులకు ఉన్నత విద్యను నిలిపేయాలని యూనివర్సిటీలకు రాసిన లేఖలో ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. ట్విట్టర్ సీఈఓగా రాజీనామా!
    టెస్లా సంస్థల అధినేత, ట్విట్టర్​ సీఈఓ ఎలాన్​ మస్క్​ సంచలన ప్రకటన చేశారు. ట్విట్టర్ అధికార బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​కు కొత్త సీఈఓను వెతికే పనిలో నిమగ్నమైనట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వారు నన్ను ఎందుకు వెంబడించారో.. షాక్​ అయ్యా: సూర్యకుమార్​ యాదవ్​
    టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ సూర్యకుమార్​ యాదవ్​ తన లైఫ్​లో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గురించి చెప్పాడు. ఆ సంగతులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Unstoppable: పవన్​ను బాలయ్య అడిగే ప్రశ్నలు ఇవేనటా!
    బాలయ్య అన్​స్టాపబుల్​ షోకు పవన్​కల్యాణ్​ రాబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ ఎపిసోడ్​ బాలయ్య.. పవన్​ను అడిగే ప్రశ్నలు ఇవేనంటూ మరో ప్రచారం జరుగుతోంది. ఆ సంగతులు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Dec 21, 2022, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.