ETV Bharat / state

Anandaiah Medicine:'ఆనందయ్య మందు' పంపిణీ ప్రారంభమైంది..ఎక్కడంటే !

కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం..కరోనాకు పని చేస్తుందని నమ్మేవాళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మందు పంపిణీ నెల్లూరు జిల్లా గొలగమూడిలో ప్రారంభమైంది. శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం వద్ద ఇవాళ లాంఛనంగా పంపిణీ ప్రారంభించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ఔషధం ఇస్తామని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మరోవైపు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకూ ఈ ఔషధం అందుబాటులోకి రానుంది. అధికారుల నుంచి అనుమతి వచ్చిన వెంటనే అన్ని జిల్లాల్లోని కరోనా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారు.

Anandaiah Medicine distribution start at golagamudi
'ఆనందయ్య మందు' పంపిణీ ప్రారంభం
author img

By

Published : Jun 7, 2021, 6:15 PM IST

'ఆనందయ్య మందు' పంపిణీ ప్రారంభమైంది..ఎక్కడంటే !

నెల్లూరు జిల్లా గొలగమూడిలో కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం పంపిణీ ప్రారంభమైంది. శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం వద్ద ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ ఇవాళ లాంఛనంగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ పూర్తి చేసిన అనంతరం..జిల్లావ్యాప్తంగా ఔషదం ఇస్తామని కాకాణి పునరుద్ఘాటించారు. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో బాధపడుతున్నవాళ్లకు ఉచితంగా మందు ఇవ్వాలని యోచిస్తున్నామని.. ప్రభుత్వ సహకారంతోనే అది సాధ్యమౌతుందని ఆనందయ్య చెప్పారు. ఆదేశాలు వచ్చి వారం రోజులు గడుస్తున్నా..మౌలిక సదుపాయాలు సమకూర్చుకోకపోవటం వల్లనే తయారీ ఆలస్యమవుతోందోని వెల్లడించారు.

చంద్రగిరిలోనూ..

మరోవైపు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకూ ఈ ఔషధం అందుబాటులోకి రానుంది. ఆనందయ్య ఔషధాల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ప్రివెంటెవ్ మెడిసిన్ "పీ" తయారీని..చంద్రగిరి మండలం ముక్కోటి తీర్థంలో ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఔషధం తయారీ కోసం నియోజకవర్గంలోని ఆరు మండలాల అటవీ ప్రాంతాల నుంచి స్థానిక ప్రజలే ఆరు రకాల వనమూలికలు సిద్ధం చేయగా..కృష్ణపట్నం నుంచి ఆనందయ్య మరో పదిరకాల ముడిపదార్థాలను పంపించారు. మొత్తం 16 రకాల ఔషధాలతో మందు తయారీ చేస్తున్నారు. ఆనందయ్య ఔషధంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని గౌరవించి..కరోనా నివారణకు శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే ప్రివెంటివ్ మెడిసిన్​ మాత్రమే తయారు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో లక్షా 60 వేల కుటుంబాలకు మందు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్, ఆయన శిష్యబృందం కలిసి ఔషధాన్ని తయారుచేస్తున్నారు.

కొరవడిన మౌలిక సదుపాయాలు

ఆనందయ్య ఔషధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పటికీ..అత్యవసరంలో ఉన్న రోగులకు మందు ఇంకా చేరటం లేదని స్థానికులు అంటున్నారు. మౌలిక సదుపాయాలు, ఇతర అనుమతులు లేకపోవటం వల్లనే...తయారీ ఆలస్యమవుతోందని చెబుతున్నారు. మందు కోసం కృష్ణపట్నం ఎవరూ రావొద్దని ఆనందయ్య, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా...కొవిడ్‌తో బాధపడుతూ ప్రాణాల మీద ఆశతో వస్తున్నవారికి పంపిణీలోనూ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మందు పంపిణీకి అనుమతి వచ్చి వారం రోజులు కావొస్తున్నా...తయారీ, పంపిణీకి ఇప్పటివరకూ అధికారులు ఎటువంటి ప్రణాళికగానీ, ఏర్పాట్లు గానీ చేయలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకూ సొంతనిధులు, దాతలోనే ఆనందయ్య మందు తయారుచేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఇంకా పంపిణీ పూర్తికాలేదు. ప్రభుత్వం సహకరిస్తేనే...వేగంగా మందు ప్రజల వద్దకు వెళ్తుందని అభిప్రాయపడ్డారు.

ఆనందయ్య మందు కృష్ణపట్నం దాటి...అన్ని జిల్లాలకూ, ఇతర రాష్ట్రాలకు చేరాలంటే ప్రభుత్వం, అధికార యంత్రాంగం సదుపాయాల కల్పనలో సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి

Anandayya Medicine: ఆనందయ్య 'కె' మందుకు హైకోర్టు అనుమతి!

Anandaiah Medicine: 'ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప సహకారం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.