నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర జలవరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఇదే సమయంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు.. తమపై అధికారుల వేధింపులు ఆపాలంటూ నిరసన చేపట్టారు. వైకాపా కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్ధసారధి అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.
నాయుడుపేట పురపాలక సంఘం అంబేడ్కర్ విగ్రహానికి బామ్ సెఫ్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు ప్రదర్శన చేసి నివాళులర్పించారు. భాజపా తిరుపతి అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకులు గాంధీ తదితరులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేశారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి, వైకాపా ఎమ్మెల్యే సంజీవయ్య ఇతర నాయకులు పూలమాలలు వేసి మహనీయుని సేవలను గుర్తుచేసుకున్నారు.
ఇవీ చదవండి: