ETV Bharat / state

సాంకేతిక దన్ను కోసం రైతుల ఎదురుచూపులు..!

పెట్టుబడులు పెరిగిపోయి... గిట్టుబాటు ధర రాక సతమతమవుతోన్న రైతులకు... ఈ రబీ సీజన్​ మరింత సమస్యగా మారింది. ప్రభుత్వం అందజేసే పరికరాలను ఇప్పటికీ అధికారులు ఇవ్వకపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Dec 24, 2019, 7:38 PM IST

nellore farmers worry about it's crop
పంటకు గిట్టుబాటు ధర రాలేదని ఆందోళనలో నెల్లూరు రైతులు
సాంకేతిక దన్ను కోసం రైతుల ఎదురుచూపులు..!

నెల్లూరు జిల్లాలో ఇప్పటికే రబీ సీజన్ ప్రారంభం కావడం వల్ల చాలామంది రైతులు వరి నాట్లు వేశారు. సాగునీరు పుష్కలంగా ఉండటంతో 8 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది రాయితీపై రైతులకు అవసరమైన స్ప్రేయర్లు, నాగలి, ట్రాక్టర్స్, రోటవేటర్ వంటి పరికరాలు వ్యవసాయ శాఖ ఇచ్చేది. ప్రస్తుతం సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా... నేటికీ వ్యవసాయ శాఖ పరికరాలు ఇవ్వకపోవడం వల్ల... ప్రైవేట్ మార్కెట్​లో కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా అధిక ధరలకు యంత్రాలు కొంటే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో... రైతులకు యంత్రాలు అందకపోవడం వల్ల చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యంత్ర పరికరాలు పంపిణీ చేయాలని రైతు నాయకులు కోరుతున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని, వచ్చిన వెంటనే పరికరాలు అందజేస్తామని వివరిస్తున్నారు.

ఇదీ చూడండి: 'పనులు పూర్తయ్యేదెన్నడు? సమస్య తీరేదెన్నడు?'

Intro:AP_NLR_08_10_JK_AGRICULTER_NO_YANTHRALU_RAJA_PKG_VIS_AP10134 anc నెల్లూరు జిల్లాలో రబీ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే చాలామంది రైతులు వరి నాట్లు వేశారు. ఇంకా వరి నాట్లు ట్ల వేస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా యంత్ర పరికరాలు ప్రతి ఏడాది రాయితీపై అందిస్తుంది. ఈ రబీ సీజన్లో మాత్రం రైతు యంత్ర పరికరాలు అందించకపోవడంతో, ప్రవేట్ మార్కెట్లో కొనుగోలు చేస్తూ నష్ట పోతామని అని రైతులు చెబుతున్నారు. మరోవైపు పెట్టుబడి ఖర్చులు కూడా భారీగా పెరిగాయని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితులలో ఈటీవీ జైకిసాన్ కథనం. వాయిస్ ఓవర్;1 ఈ రబీ సీజన్లో నెల్లూరు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాల్లో వరి సాగు రైతులు చేస్తున్నారు. జలాశయాలు నిండుకుండలా నీరు ఉండడంతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేపడుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా రైతులకు అవసరమైన స్ప్రేయర్లు, నాగలి, ట్రాక్టర్స్, రోటవేటర్ వంటి పరికరాలు వ్యవసాయ శాఖ ప్రతి ఏడాది రైతు రైతులకు రాయితీపై అందిస్తుంది. రవి సీజన్ ప్రారంభం రెండు నెలలు కావస్తున్నా నేటికీ వ్యవసాయ శాఖ ద్వారా ఇస్తున్న రాయితీలు పరికరాలు అందక పోవడంతో రైతుల ప్రవేట్ మార్కెట్లో అధిక అధిక ధరలకు పరికరాల కొనుగోలు చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. ఆఫీస్ చుట్టూ తిరుగుతూ తప్ప ఎటువంటి ప్రయోజనం జరగడం లేదని రైతులు అంటున్నారు. బైట్స్: రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్;2 వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప, రైతులకు కావాల్సిన పనిముట్లను అందడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయని రైతులు చెబుతున్నారు. పురుగుమందులు ఎరువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, రైతు పండించిన ధాన్యానికి మాత్రం మద్దతు ధర ఉండటం లేదని రైతులు అంటున్నారు. ఈ ప్రభుత్వం అయినా రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. బైట్స్; రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్;3 రబీ సీజన్ ప్రారంభమైన నేటికీ వ్యవసాయ శాఖ పరిధిలో రైతులకు యంత్ర పరికరాలు అందకపోవడంతో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం యంత్ర పరికరాలు విడుదల చేయాలని రైతు నాయకులు కోరుతున్నారు. బైట్; రైతు నాయకుడు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్;4 ప్రభుత్వానికి నివేదికల పంపామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు రాలేదని వచ్చిన వెంటనే రైతులకు పరికరాలు అందజేస్తామని వారు చెబుతున్నారు. బైట్,; శివ నాయక్ ,వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు నెల్లూరు జిల్లా

Body:nellore

Conclusion:B.RAJA, NELLOR, 9394450293

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.