సర్కారు బడులపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు నెల్లూరు జిల్లా సంయుక్త పాలనాధికారి ప్రభాకర్‌రెడ్డి తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో అన్ని వసతులతో నాణ్యమైన బోధన అందుతోందని.. దీన్ని ప్రజలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినట్లు జేసీ తెలిపారు. బుధవారం జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి లక్ష్మీ తన కుమార్తె ఎన్.అలెక్స్‌శృతిని.. దర్గామిట్ట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించారు. కుమారుడు ఎన్.క్రిష్‌ధరణ్‌రెడ్డిని ఏకేనగర్‌లోని స్పిన్నింగ్ మిల్ కాలనీలోని మున్సిపల్ స్కూల్లో నాలుగో తరగతిలో చేర్చారు. డీఈవో పి.రమేష్ సమక్షంలో ప్రవేశం కల్పించారు.
ఇదీ చదవండి: సలాం పోరాట సమితి చలో అసెంబ్లీ అడ్డగింత.. నేతల గృహనిర్బంధం