కారు ప్రమాదంలో గాయపడ్డ సినీ నటుడు కత్తి మహేష్ ఆరోగ్యం విషమంగా ఉందని నెల్లూరు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైకు తరలించారు. ఇప్పటివరకూ నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో స్పెషల్ ఐసోలేషన్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. మహేష్ తల, కళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. కత్తి మహేష్ బంధువులు, స్నేహితులు ఆస్పత్రికి చేరుకున్నారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన స్నేహితులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
ఏం జరిగింది..
కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఉదయం ప్రమాదానికి గురైంది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా కత్తి మహేష్ ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం వల్ల.. మహేష్ గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో మహేష్‌తో పాటు డ్రైవర్ ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి చేర్చారు.
ఇదీ చదవండి:
తితిదేకు త్వరగా నూతన బోర్డును ఏర్పాటు చేయండి.. కాలయాపన వద్దు'