ETV Bharat / state

వయసు 26 ఏళ్లు... గిన్నీస్‌ రికార్డులు 21...

గిన్నీస్ బుక్​లో స్థానం దక్కించుకోవడం కష్టం. అలాంటిది ఓ వ్యక్తి 21 రికార్డులు సృష్టించాడు. మార్షల్‌ ఆర్ట్స్‌లో నిలిచాడు. ఈ నెల్లూరు కుర్రాడి రికార్డులు చుస్తే ఎవరైనా ఔరా అంటారు. మరి ఇంతటి ప్రతిభ కనబరిచిన మార్షల్​ ప్రభాకర్​ రెడ్డి గురించి తెలుసుకుందామా!

కరాటేలో 21 రికార్డులు
author img

By

Published : Sep 16, 2019, 6:06 AM IST

నిత్య విద్యార్థి, అంతులేని ప్రతిభ, అంతకుమించి కృషి పట్టుదల. అవన్నీ కలిపితే ప్రభాకర్​ రెడ్డి దేశంలోనే అత్యుత్తమ మార్షల్ ఆర్ట్స్‌లో తనకంటూ స్థానం సంపాదించారు. భిన్నమైన ఆలోచనతో ప్రపంచంలోనే ఎవరూ సాధించలేని రికార్డులు సృష్టించారు. 21 గిన్నిస్ రికార్డులు 3 లిమ్కా బుక్ రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నారు. అలాగే పది మందికి శిక్షణ ఇస్తూ వారినీ ఆ దిశగా ప్రోత్సహిస్తారు.

ఇలా మొదలైంది....

మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రభాకర్​ రెడ్డి... తండ్రి శంకర్ ప్రోత్సాహంతో 11 ఏళ్ళ నుంచే మార్షల్‌ ఆర్ట్స్​లో శిక్షణ తీసుకున్నారు. జాతీయ స్థాయిలో బహుమతులు గెలిచారు. 17ఏళ్ళ వయస్సు నుంచే కరాటే మాస్టర్​గా నెల్లూరులో శిక్షణా కేంద్రం ప్రారంభించారు. వేల మందికి తర్ఫీదు ఇచ్చారు. ఓ ప్రత్యేకమైన లక్ష్యంతోనే రికార్డులు సాధిస్తున్నట్టు చెబుతున్నారీ మార్షల్‌ మాష్టార్‌.

2012లో ప్రపంచ రికార్డుల కోసం వేట ప్రారంభించిన ప్రభాకర్ రెడ్డి... ఒక్కొక్కటిగా పాత రికార్డులు తుడిచేస్తున్నారు. 27గంటలపాటు మార్షల్ ఆర్ట్స్‌లో నిరంతరాయంగా శిక్షణ ఇచ్చి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సొంత చేసుకున్నారు. 2013లో 36 గంటలపాటు వజ్రాసనం వేసి యూనిక్ వరల్డ్ రికార్డు అందుకున్నారు. 2017ఏళ్లలో 9 నిమిషాల్లో 110 మంది సభ్యులకు లక్షా 18వందల 75 పంచులు ఇచ్చి లిమ్కాబుక్‌లో పేరు నమోదు చేసుకున్నారు. రష్యా, యూకే, థాయిలాండ్, మలేషియా నేపాల్ నుంచి వచ్చి మరీ ఈయన వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.

ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న, నమ్ముకున్న ఆటను పది మందికి నేర్పేందుకు ప్రభాకర్ రెడ్డి చేస్తున్న కృషిని అందరూ అభినందిస్తున్నారు.

21రికార్డులు సాధించిన మార్షల్ మాస్టర్ ప్రభాకర్ రెడ్డి

ఇదీ చూడండిపోలవరం రివర్స్ టెండర్ల వెనక మర్మమేంటి?

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_26_14_CAR_BOLTHA_AP10121

Body:కడప జిల్లాలోని దువ్వూరు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం కారు బోల్తా పడింది. ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న కర్నూలు పట్టణానికి చెందిన అవినాష్, మేఘనాష్ లు గాయపడ్డారు . కర్నూలు నుంచి కడప వైపు వెళ్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి రహదారిపై విభాజకాన్ని ఢీ కొని బోల్తా పడింది. ప్రమాదంతో కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

Conclusion:note: sir వీడియో ఫైల్ ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.