ETV Bharat / state

నెల్లూరులో కాంట్రాక్ట్​ ఉద్యోగి దారుణ హత్య - murder news in nellore news

నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

a person murdered
హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
author img

By

Published : Dec 7, 2020, 5:00 PM IST

నెల్లూరులోని కరెంట్​ ఆఫీస్​ సెంటర్​ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సంగం మండలంలోని బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న రవీంద్రనాథ్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హతమార్చారు. గొంతు, పొత్తి కడుపులో గాయపరచటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగ పని నిమిత్తం రవీంద్రనాథ్​ విజయవాడకు వెళ్లి వచ్చిన అనంతరం ఘటన జరిగింది.

విషయం తెలుసుకున్న వేదాయపాళెం పోలీస్​స్టేషన్ సీఐ సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలు, హంతకుల జాడ తెలియలేదని..దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మృతుడికి వచ్చే నెలలో వివాహం నిశ్చయమైందని బంధువులు తెలిపారు.

ఇదీ చదవండి: రైలు ఢీకొని బధిర బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.