శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌నర్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో పోలీసుల అదుపులో ఉన్న వైద్యుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గురువారం తెల్లవారుజామున పోలీసుల కళ్లు గప్పి స్టేషన్ నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కావలి డీఎస్పీ ప్రసాద్ ఉదయగిరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి విచారణ చేశారు. వైద్యుణ్ని స్టేషన్లో ఉంచిన గదిని పరిశీలించి, రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది, స్థానిక సీఐ సత్యనారాయణతో మాట్లాడారు.
సిబ్బందిపై చర్యలు
ఇవాళ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ నుంచి వైద్యుడు పారిపోయాడని డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. త్వరలోనే నిందితుణ్ని పట్టుకుంటామని చెప్పారు. ఈ ఘటనలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సంబంధిత కథనం:
ఫోన్ చేసి ఆమ్లెట్ కావాలన్నాడు... వెళ్తే కోరిక తీర్చమని వేధించాడు