ETV Bharat / state

ప్రాణం తీసిన కుటుంబ కలహాలు.. నెల్లూరు జిల్లాలో ఘోరం..

attack: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరు ప్రాథమిక పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహకురాలిపై ఆమె భర్త కత్తితో దాడి చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది.

knife attack
కత్తితో దాడి
author img

By

Published : Nov 4, 2022, 10:00 PM IST

Updated : Nov 4, 2022, 10:32 PM IST

Knife attack: కొంత కాలంగా ఉన్న విబేధాల కారణంగా భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరుకి చెందిన విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులు. కుటుంబ కలహాల కారణంగా విజయలక్ష్మి ఏడాదిన్నరగా భర్తకు దూరంగా అదే గ్రామంలో వేరుగా ఉంటూ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తోంది. వేరుగా ఉంటోందని కక్ష పెంచుకున్న వెంకటేశ్వర్లు పాఠశాలలోనే కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాఠశాలలో విద్యార్థుల ఎదుటే ఈ ఘటన జరగడంతో విద్యార్థులు భయపడి పోయారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 4, 2022, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.