నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో పాములు కలకలం సృష్టించాయి. మండలంలోని స్టౌబిడీ కాలనీ వద్ద ఓ గోడలో నుంచి పాము పిల్లలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చాయి. పక్కనే కాలువలో ఉండే నీటిలో పాము పెట్టిన గుడ్లు పగిలి.. పిల్లలు బయటకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. పదుల సంఖ్యలో బయటకు వస్తున్న పాముల కారణంగా స్థానికంగా నివసిస్తున్న వారు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవీ చూడండి...