A Special App to Control Fire: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే ఘటనా స్థలాలకు వెళ్లేందుకు అగ్నిమాపక, పోలీస్ శాఖలు ఒక యాప్‌ను రూపొందించనున్నాయి. నగరం నలుమూలల్లో నిప్పంటుకున్న ప్రాంతాలకు ఫైరింజన్లు వేగంగా రావడం లేదన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఇందుకు పూనుకున్నారు.
ట్రాఫిక్‌జాంలో చిక్కుకోకుండా..: నగరంలోని అగ్నిప్రమాదాలు జరిగిన ప్రదేశం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే.. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఫైరింజన్లు చేరుకోవడానికి 15-20నిమిషాలు పడుతుంది. ఈలోపు మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రత్యేకయాప్ ఉపకరిస్తుంది.
- ప్రమాద సమాచారాన్ని యాప్‌లో నమోదు చేయగానే... ఆ ప్రాంతాన్ని యాప్ జియోట్యాగింగ్ చేస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ రద్దీని ట్రాఫిక్ పోలీసుల మ్యాప్‌ను అనుసంధానిస్తుంది.
- ఘటన స్థలాలకు వెళ్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు, ఫైరింజన్‌తోపాటు ఉన్న సిబ్బంది మొబైల్ ఫోన్లలో జీపీఎస్ యాక్టివేట్ అవుతుంది. యాప్ చూపించే మార్గాన్ని అగ్నిమాపకశాఖ అధికారులు ట్రాఫిక్ పోలీసులకు వివరించగానే... వారు అప్రమత్తమై ఫైరింజన్ వచ్చేమార్గంలో ట్రాఫిక్‌జాం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
బెంగళూరు స్ఫూర్తితో: బెంగళూరు నగరంలో పదమూడేళ్ల క్రితం కార్ల్‌టన్ టవర్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 9మంది సజీవ దహనమయ్యారు. ఇలాంటి విపత్తు మరోసారి జరగకుండా.. ఒకవేళ అనూహ్యంగా అగ్నిప్రమాదం జరిగినా ప్రాణనష్టం లేకుండా వేగంగా స్పందించేందుకు బియాండ్ కార్ల్‌టన్ పేరుతో ఒక సంస్థ ముందుకు వచ్చింది. కర్ణాటక అగ్నిమాపకశాఖ భాగస్వామ్యంతో ‘ఫైర్‌ఛాంప్’ పేరుతో ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బెం
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న ప్రజలు దాని ద్వారా అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని పంపించవచ్చు. ఇంతేకాదు.. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలు, అపార్ట్‌మెంట్లు. స్కూళ్లకు సంబంధించిన వివరాలనూ అందులో నమోదు చేయవచ్చు. దీంతోపాటు ‘బియాండ్ కార్ల్‌టన్.ఓఆర్‌జీ’వెబ్‌సైట్ ద్వారా బెంగళూరు నగరంలోని ఫైర్‌సేఫ్టీ బ్లూప్రింట్‌ను చూడొచ్చు. ఫైర్‌ఛాంప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్న పౌరులు సమాచారం అందిస్తుండడంతో అక్కడ అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే అగ్నిమాపక, పోలీస్ శాఖలు వేగంగా స్పందిస్తున్నాయి.
ఇవీ చదవండి: