నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 64కు చేరింది. వీరిలో ఒకరు డిశ్చార్జి కాగా, ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో లాక్డౌన్ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు నిత్యావసరాలు కొనుగోలు చేసే సమయంలోనూ రద్దీ లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న పేదలకు దాతలు ఆహార పొట్లాలు, నిత్యావసరాలు అందిస్తున్నారు.
ఇది చదవండి తీరు మారాలి.. ఇలా ఉంటే కరోనా నివారణ ఎలా..?