పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది. సమస్యల పరిష్కారం కోసం వివిధ సంఘాలు నిరసన బాట పట్టాయి. సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్య, పోడు సాగుకిచ్చిన పట్టాలను ఆన్లైన్ చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ కార్యాలయం వద్ద 'స్పందన' కార్యక్రమం నిర్వహించాలని నిరనస వ్యక్తం చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో సవర భాష వాలంటీర్లు వాయిద్యాలతో సందడి చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకొని అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఇవీ చూడండి